ఆలేరు టౌన్ , నబంబర్ 21: కాం గ్రెస్, బీజేపీ రహస్య ఒప్పందంతోనే కేటీఆర్‌పై అక్రమ కేసును మరోసారి తెరపైకి తెచ్చాయని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి విమర్శించారు. ఆలేరులోని రహదారి బంగ్లాలో శుక్రవారం ఆమె మాట్లాడారు. రైతుల కష్టాలను తెలుసుకునేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలకు ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి భయపడే ఈ అక్రమ కేసును మరోసారి తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో కేటీఆర్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు.