మరిపెడ, ఫిబ్రవరి 8 : కాంగ్రెస్కు ఓట్లు వేయకుంటే డంపింగ్ యార్డును మళ్లీ తెస్తానని ప్రభుత్వ విప్ రాంచంద్రు నాయక్ ఓటర్లను హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి ఆయన మహబూబాబాద్ జిల్లా మరిపెడలోని 8వ వార్డులో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ మాట్లాడారు. కూన్యతండా ప్రజలు కాంగ్రెస్కు ఓటు వేయకపోతే.. గతంలో ఇక్కడ ఉన్న డంపింగ్ యార్డును మళ్లీ తీసుకొస్తానని బెదిరించారు. ‘కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్న కూన్యతండాకు చెందిన వెంకన్న గెలిస్తే.. నేను మీకు పని చేయను. నా మాట వింటేనే మీకోసం పనిచేస్తా.. ఇది చాలెంజ్.. తర్వాత చూసుకుందాం’ అని ఎమ్మెల్యే బెదిరించడంతో తండావాసులు కంగుతిన్నారు. ఈ వీడియో పట్టణ పరిధిలోని సోషల్ మీడియాలో వైరల్గా మారింది.