బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Oct 01, 2020 , 18:03:11

క‌రోనా చికిత్స‌.. బ‌యోలాజిక‌ల్-ఈ ద్వారా యాంటీసెరా

క‌రోనా చికిత్స‌.. బ‌యోలాజిక‌ల్-ఈ  ద్వారా యాంటీసెరా

హైద‌రాబాద్‌: న‌గ‌రానికి చెందిన బ‌యోలాజిక‌ల్ ఈ లిమిటెడ్ సంస్థ‌.. క‌రోనా వైర‌స్ చికిత్స కోసం జంతువుల్లో యాంటీసెరా మందును అభివృద్ధి చేసింది.  ఐసీఎంఆర్‌తో క‌లిసి అత్యంత శుద్దీక‌రించిన ప్లాస్మాతో యాంటీసెరా మందును డెవ‌ల‌ప్ చేశారు. వ్యాధి నివార‌ణ కోసం యాంటీసెరా విధానాన్ని వాడుతారు. వైద్య శాస్త్రంలో గ‌తంలో ఇలాంటి చికిత్స‌ల‌ను వైర‌ల్‌, బ్యాక్టీరియా వ్యాధుల నియంత్ర‌ణ కోసం వినియోగించిన‌ట్లు ఐసీఎంఆర్ త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్న‌ది.  గ‌తంలో రేబిస్‌, హెపిటైటిస్ బీ, వ్యాక్సినా వైర‌స్‌, టెటాన‌స్‌, బోటులిజం, డిప్తీరియా లాంటి వ్యాధుల చికిత్స కోసం యాంటీసెరా విధానాన్ని వాడారు. వాస్త‌వానికి కోవిడ్‌19 నుంచి కోలుకున్న రోగుల నుంచి కూడా తీసిన ప్లాస్మాతోనూ ఇలాంటి చికిత్స‌నే చేయ‌వచ్చు. అయితే యాంటీబాడీల ప్రొఫైల్‌, వాటి స‌మ‌ర్థ‌త‌, సాంద్ర‌త మారుతుండ‌డం వ‌ల్ల పేషెంట్ మేనేజ్మెంట్ చేయ‌డం కొంత క‌ష్టసాధ్యంగా ఉంటుంది.  కోవిడ్ వేళ ఐసీఎంఆర్ అందిస్తున్న ప్రోత్సాహాం వ‌ల్ల‌ సెరా చికిత్స ఉపయుక్తంగా మారుతుంద‌ని ఆశిస్తున్నారు. ‌  


logo