స్టేషన్ ఘన్పూర్, డిసెంబర్ 21: తాను కారు గుర్తుతోనే గెలిచానని, నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నట్టు స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపొందిన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను ఆదివారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సన్మానించారు.
ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచానని, కానీ నియోజకవర్గ అభివృద్ధి కోసం రెండేండ్లుగా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నట్టు వెల్లడించారు.