Bandi Bhagirath : పోక్సో కేసులో నిందితుడిగా ఉండి తప్పించుకుతిరుగుతున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పేట్ బషీరాబాద్ పోలీసులకు ఒక మెయిల్ చేశాడు. తాను ఎల్లుండి (శుక్రవారం) సిట్ విచారణకు హాజరవుతానని ఆ మెయిల్లో పేర్కొన్నాడు. నిజానికి బండి భగీరథ్ సిట్ బుధవారం సిట్ విచారణకు హాజరుకావాలంటూ సిట్ అధికారులు ఈ నెల 12న నోటీసులు జారీచేశారు.
సిట్ నోటీసుల ప్రకారం.. భగీరథ్ ఇవాళ మధ్యాహ్నం 2.00 గంటలకు విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే పరారీలో ఉన్న భగీరథ్ ఈ విచారణకు డుమ్మా కొట్టాడు. అయితే సిట్ విచారణకు పిలిచిన గడువు ముగిసిన తర్వాత మూడు గంటలకు ఆయన పేట్‌బషీరాబాద్ పోలీసులకు మెయిల్ చేశాడు. తాను శుక్రవారం పూర్తి సాక్ష్యాధారాలతో సిట్ విచారణకు వస్తున్నానని ఆ మెయిల్లో తెలియజేశాడు. ఈ కేసులో తాను సిట్‌కు అన్ని విధాలుగా సహకరిస్తానని తెలిపారు.