గద్వాల, ఏప్రిల్ 22 : ‘నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను. బీఆర్ఎస్ వారు ఇచ్చిన బీ ఫాంతో ఎమ్మెల్యేగా గెలిచా’ అని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడిన మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసిన మాట వాస్తమే కానీ.. ఎప్పుడూ కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని చెప్పుకొచ్చారు. ఇక్కడి కాంగ్రెస్ నాయకులు సొంత ప్రయోజనాలకోసం రాజకీయం చేస్తే నష్టపోయేది ప్రజలే అని తెలిపారు.