HYDRAA | హైదరాబాద్ : హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్టీఎల్లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అనుమతులు ఇచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సైబరాబాద్ కమిషనర్‌కు హైడ్రా సిఫారసు చేసినట్లు సమాచారం. హెచ్ఎండీఏలో అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారుల జాబితాను హైడ్రా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ఇక అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా పాల్గొన్నారు. హైడ్రాకు వ్యతిరేకంగా పలువురు నేతలు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేతలు కోర్టుకు వెళ్లడంపై ఏం చేయాలనే యోచనలో చర్చించినట్లు సమాచారం. హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
Hydra | పేదల ఇండ్ల జోలికొస్తే సహించేది లేదు : ఎంపీ ఈటల రాజేందర్
Special Trains | ప్రయాణికులకు శుభవార్త.. 60 ప్రత్యేక రైళ్లను పొడిగించిన చెప్పిన దక్షిణ మధ్య రైల్వే..
Tirupathi Reddy | నా ఇంటిని కూల్చివేయొచ్చు : సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు