ఒక్క రూపాయికే లీటర్ పాలు!.. ఫ్లిప్‌కార్ట్‌పై కర్ణాటక పాల సంఘం దావా
లీటర్ పాలను ఒక్క రూపాయికే విక్రయిస్తు న్న ఫ్లిప్‌కార్ట్‌పై కర్ణాటకకు చెందిన ఓ పాల సంఘం దావా వేసింది. ఇంత తక్కువ ధరకు పాలను విక్రయించటం రైతుల ఆత్మగౌరవానికి భంగం కలిగించడమేనని ‘బెంగుళూరు మిల్క్ యూ నియన్ లిమిటెడ్' పేర్కొన్నది.
బెంగళూరు, మార్చి 15: లీటర్ పాలను ఒక్క రూపాయికే విక్రయిస్తు న్న ఫ్లిప్‌కార్ట్‌పై కర్ణాటకకు చెందిన ఓ పాల సంఘం దావా వేసింది. ఇంత తక్కువ ధరకు పాలను విక్రయించటం రైతుల ఆత్మగౌరవానికి భంగం కలిగించడమేనని ‘బెంగుళూరు మిల్క్ యూ నియన్ లిమిటెడ్’ పేర్కొన్నది. ఫ్లిప్‌కార్ట్‌కు వ్యతిరేకంగా ‘కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా’ (సీసీఐ)కి ఫిర్యా దు చేసినట్టు పాల సంఘం అధ్యక్షుడు డీకే సురేశ్ చెప్పారు.
ఇది ఎంతమాత్ర మూ న్యాయమైంది కాదని, రైతుల కష్టాన్ని, గౌరవాన్ని దెబ్బతీసేదిగా సురేశ్ పేర్కొన్నారు. పాల అమ్మకంపై ఫ్లిప్‌కార్ట్ ఇస్తున్న ఆఫర్ ఈ రంగంలో అనేక సమస్యల్ని తెచ్చిపెడుతున్నదని అన్నారు. ఎన్నో వ్యయప్రయాసలకు గురై.. డైరీ ఫామ్స్ నడుపుతున్న వాళ్ల ను దెబ్బతీస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కువమంది కస్టమర్లను ఆకర్షించేందుకు ఈకామర్స్ సంస్థ ‘ఫ్లిప్‌కార్ట్’ ఈ విధమైన ఆఫర్లు ప్రకటిస్తున్నదని, దీనిపై ప్రధాని మోదీకి కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

