సంగారెడ్డి : రాష్ట్రంలో హైడ్రా(HYDRAA ) కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌తో పాటు సంగారెడ్డిలో పలుచోట్ల భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు(Demolish building) చేపట్టారు. తాజాగా సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువు(Malkapur pond) మధ్యలో అక్రమంగా నిర్మించిన ఇంటిని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కూల్చేశారు. చెరువు నీటి మధ్యలో కట్టిన బిల్డింగ్‌ను బ్లాస్టింగ్ చేసే క్రమంలో బిల్డింగ్ శకలాలు తగిలి హోమ్ గార్డు గోపాల్‌తో పాటు మరొకరికి గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు.
మరోవైపు మూసీ పరిసరాల్లో సుమారు 40వేల ఇండ్లు చెదిరిపోనున్నాయి.. వందలాది కుటుంబాలు రోడ్డునపడనున్నాయి.. ఇప్పుడు హైడ్రా బుల్డోజర్లు మూసీ నివాసాలపైకి విరుచుకుపడేందుకు సిద్ధం కావడంతో నిర్వాసితుల్లో కంటిమీద కునుకు కరువైంది. మూసీ వెంట కూల్చివేతలకు ప్రభుత్వం నుంచి అన్నీ అనుమతులు రాగా త్వరలోనే కూల్చివేతల ప్రక్రియ చేపట్టనున్నారు.
చెరువులో కట్టిన భవనాన్ని బాంబులతో కూల్చేసిన అధికారులు.. శిథిలాలు తగిలి ఇద్దరికి గాయాలు
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి పెద్ద చెరువులో మూడు అంతస్తుల భవనం నిర్మించాడు.
ఆ భవనం FTL పరిధిలో అక్రమంగా నిర్మించారని గుర్తించిన అధికారులు దాన్ని బాంబులతో… pic.twitter.com/rSR64Kp8GB
— Telugu Scribe (@TeluguScribe) September 26, 2024
Hanu Man | బాహుబలి, ఆర్ఆర్ఆర్ రూట్లో తేజ సజ్జా హనుమాన్.. ప్రశాంత్ వర్మ కొత్త పోస్టర్ వైరల్
Prakash Raj | చేయని తప్పుకి సారీ.. హాట్ టాపిక్‌గా ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్
Devara Movie | ‘దేవర’ టికెట్ ధరలు.. నిర్మాతలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భారీ షాక్.!