Hydraa | రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతలు మళ్లీ కొనసాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం మరిన్ని కూల్చివేతలను మొదలుపెట్టాయి. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వందనపురి కాలనీలో 848 సర్వే నంబర్లో ఉన్న నిర్మాణాన్ని నేలమట్టం చేశాయి.
భారీ యంత్రాలతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు అమీన్పూర్ పరిధిలోని పలు నిర్మాణాన్ని కూల్చివేశారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు సమీపంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. కాగా, రహదారిని కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారని కాలనీవాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నట్లు హైడ్రా అధికారులు చెబుతున్నారు.
బ్రేకింగ్ న్యూస్
సంగారెడ్డి అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా
వందనపురి కాలనీలో 848 సర్వే నంబర్లో నిర్మాణాలపై కొరడా
భారీ యంత్రాలతో రంగంలోకి దిగి కూల్చివేస్తున్న హైడ్రా pic.twitter.com/hzhUVszAJh
— Telugu Scribe (@TeluguScribe) November 18, 2024