సంగారెడ్డి : హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydraa Commissioner Ranganath) అమీన్పూర్ మున్సిపాలిటీలో పర్యటించారు. మున్సిపాలిటీలోని( Aminpur Municipality) ఐలాపూర్ రాజగోపాల్ నగర్, చక్రపురి కాలనీ అసోసియేషన్ సభ్యులతో సమావేశమయ్యారు. ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితుల ఫిర్యాదు మేరకు శుక్రవారం ప్లాట్ల వద్దకు వచ్చి బాధితులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి ప్లాట్ల ఫిజికల్ పొజిషన్ పరిశీలించి వారి సమస్యను కులంకషంగా అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలకు వెంటనే పరిష్కారం చూపుతానని బాధితులకు భరోసా ఇచ్చారు.
కాగా, ఐలాపూర్ గ్రామ వాసి, సుప్రీం కోర్టు న్యాయవాది ముఖీం హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతుండగా ఇరువురి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మీకు తెలుగు వచ్చా అంటూ ముఖీం రంగనాథ్‌ను ప్రశ్నించారు. మీరు చెప్పేది మీరు చెప్పండి.. ఓవర్ యాక్షన్ చెయొద్దంటూ రంగనాథ్ అతడిని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
Jangaon Collectorate | జనగామ కలెక్టరేట్లో 30 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు
Womens Health | మహిళలు ఈ మసాలా దినుసులను రోజూ కచ్చితంగా తీసుకోవాలి.. ఎందుకంటే..?