లింగాల, ఫిబ్రవరి 22 : నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం అంబట్పల్లిలోని సర్వేనంబర్ 732లో 5.29 గుంటల భూమి ఉండగా, అక్రమంగా ప్రహారీ నిర్మించారని పోలీసుల బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు శనివారం కూల్చివేశారు.
వారం రోజుల కిందట అధికారులు సర్వే చేసి మార్క్ వేసి గురువారం అక్రమ కట్టడాలను తొలగించడానికి వెళ్లగా, బాధితులు, గ్రామస్తులు అడ్డుకోవడంతో వెరుదిరిగారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తహసీల్దార్ పాండునాయక్, ఎంఆర్ఐ సీతారాం శనివారం తెల్లవారుజామున 4 గంటలకు ప్రహరీని కూల్చివేశారు. సమయం ఇవ్వాలని అధికారులకు విన్నవించినా వినకుండా కూలగొట్టారని విండో చైర్మన్ ఆరోపించారు.