హైదరాబాద్ : కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించడం లేదు. సినీహీరో నిఖిల్ పేరిట ఉన్న ఓ కారు లాక్డౌన్ నిబంధన ఉల్లంఘించడంతో ట్రాఫిక్ పోలీసులు బుధవారం చలానా విధించారు. కారుకు నంబర్ ప్లేట్ సరిగా లేకపోవడంతో మరో చలానా వేశారు. చలానా విధించిన సమయంలో సినీహీరో నిఖిల్ కారులో లేరని పోలీసులు ధ్రువీకరించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.