Amit Shah | జూబ్లీహిల్స్, జూలై 6: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అగ్రనేత అమిత్‌షా, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కోడ్ ఉల్లంఘించినట్టు ఆరోపిస్తూ నమోదు చేసిన కేసును పోలీసులు ఉపసంహరించుకున్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా పాతబస్తీలో అమిత్‌షాపై పలు కేసులు నమోదయ్యాయి. కాగా మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన కేసుకు సంబంధించి పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్లో అమిత్‌షా, కిషన్‌రెడ్డి పేర్లను కేసు నుంచి తొలగిస్తున్నట్టు పేర్కొన్నారు.
వారికి వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాధారాలు లభ్యం కాలేదని తెలిపారు. ఈ మేరకు దీనిపై స్పందించాలని కోరుతూ టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గోపిశెట్టి నిరంజన్‌కు ఎనిమిదో చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఒక నోటీసును పంపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన అనంతరం ఈ అనూహ్య పరిణామం చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.