శంషాబాద్ రూరల్, అక్టోబర్ 5: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.2.19 కోట్ల విలువైన బంగారాన్ని గురువారం కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఐదుగురు ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని తనిఖీ చేయగా, సీట్ల కింద, దుస్తుల మధ్య పెట్టుకొని బంగారాన్ని తీసుకొచ్చినట్టు గుర్తించారు.
ఐదుగురిని అదుపులోకి తీసుకొని, మూడు కిలోల 734 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. మరో వ్యక్తి 20 వేల యూఎస్ డాలర్స్‌ను బహ్రెయిన్‌కు తీసుకెళ్తుండగా పట్టుకున్నారు. వాటి విలువ భారత కరెన్సీలో రూ.16.46 లక్షలు ఉంటుందని వివరించారు.