నాంపల్లి కోర్టులు, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీఆర్‌కు వ్యతిరేకంగా మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టు తీ వ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇకపై కొండా సు రేఖ నోటికి వచ్చినట్టు మాట్లాడరాదని, ఎలాం టి అనుచిత వ్యాఖ్య లు చేయరాదని నాంపల్లిలోని సిటీ సివిల్ కోర్టు మంత్రి కొండాసురేఖ ను ఆదేశించింది. పరువు, ప్రతిష్ఠలు కలిగిన కే టీఆర్‌పై మరొకసారి నిందారోపణలు చేయ డం మంచిది కాదని పేర్కొంది.
మంత్రి కొం డా సురేఖకు వ్యతిరేకంగా కేటీఆర్ దాఖలు చే సిన రూ.100 కోట్ల పరువు నష్టం దావాలో 25వ అదనపు చీఫ్ జడ్జి శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 2న మీ డియా సమావేశంలో మంత్రి కొండా సురేఖ మాట్లాడిన మాటలు అత్యంత జుగుప్సాకరం గా ఉన్నాయని, ఆ ప్రసంగాన్ని ప్రసారం చేసిన టీవీ చానళ్లు, యూట్యూబ్ చానళ్లు, ఫేస్బుక్, గూగుల్, పత్రికల్లో ప్రచురితమైన కథనాలను, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తల్ని తిరిగి ప్రసారం చేయరాదని, ప్రచురించకూడదని ఉత్తర్వులో పేర్కొన్నారు.
ఓ మహిళా మం త్రి వ్యాఖ్యలను కోర్టు తీవ్రంగా పరిగణించి తీవ్ర హెచ్చరికలతో ఉత్తర్వులు జారీచేయడం గమనార్హం. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, సా మాజిక మాధ్యమాలకు వేర్వేరుగా ఆరు ఉత్తర్వుల ప్రతులను కోర్టు జారీ చేసింది. ఇలాంటి అనుచిత వార్తల వల్ల సమాజంలో చెడు ప్రభావం కలిగే ప్రమాదముందని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. కేటీఆర్ దాఖలు చేసిన 100 కోట్ల పరువు నష్టం దావాకు కోర్టు ఫీజుగా కోటి రూపాయలను (రూ.1,00, 02,426) బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతానుంచి కోర్టుకు ఆన్‌లైన ద్వారా కేటీఆర్ చెల్లించారు.
కొండా సురేఖతోపాటు పత్రికా సంస్థలు, ప్రముఖ టీవీ చానళ్ల యాజమాన్యాలను కలిపి మొత్తం 15 మందిపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. కేటీఆర్‌కు కోర్టు అండగా నిలవడం న్యాయానికి నిదర్శనంగా నిపుణులు భావిస్తున్నారు. గతంలోనూ ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం సైతం ఘాటుగా స్పందించినప్పటికీ ఆమెలో మార్పురాకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు.
కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల సిటీ సివిల్ కోర్టు ఆమెకు మొట్టికాయలు వేసిందని బీఆర్ఎస్ లీగల్‌సెల్ ప్రతినిధి లలితారెడ్డి చెప్పారు. కోర్టు ఆదేశాలను మంత్రితోపాటు ఆయా సంస్థలు పాటించాల్సి ఉంటుందని, ఒకవేళ ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణ నేరం కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కొండా సురేఖ ఈ నెల 2న మంత్రిస్థాయిలో ఉండి వేరే మహిళలపై చెడు వ్యాఖ్యలు చేశారని, వాటిని కేటీఆర్‌కు ఆపాదించారని తెలిపారు.
దాంతో కేటీఆర్ ఆమెపై క్రిమినల్ డిఫమేషన్, రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేశారని తెలిపారు. పిటిషన్‌పై విచారణ జరిపిన సిటీ సివిల్ కోర్టు శుక్రవారం ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చిందని, ఇందులో కొండా సురేఖతోపాటు 15 మీడియా సంస్థలను భాగస్వాములను చేసిందని చెప్పారు. సమావేశంలో బీఆర్ఎస్ లీగల్ సెల్ సభ్యులు వేణుగోపాల్‌రావు, జకుల లక్ష్మణ్, అక్కి భాసర్గౌడ్, ప్రవీణ్‌కుమార్, కావ్యశ్రీ, కార్తీక్ పాల్గొన్నారు.