Viral video | గత కొన్నిరోజులుగా యువత రెచ్చిపోతున్నారు. పబ్లిక్‌గానే హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. బైక్, కారులో ప్రయాణిస్తూ చుట్టూ ఎవరున్నారనేది కూడా చూడకుండా.. అదేదో ఫ్యాషన్ అన్నట్లు పబ్లిక్‌గానే రొమాన్స్ చేస్తూ వార్తల్లోకెక్కుతున్నారు. ఉత్తరాదిన ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి కూడా. వీటిపై పోలీసులు చర్యలు కూడా తీసుకున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లోనూ ఇదే తరహా వీడియో బయటకు వచ్చింది. తాజాగా ఈ సంస్కృతి హైదరాబాద్‌కు పాకింది.
ఓ యువ జంట రద్దీగా ఉండే హైదరాబాద్ (Hyderabad) నగర రోడ్లపై రొమాన్స్ చేసి కెమెరా కంటికి చిక్కింది. రాత్రి సమయంలో హైదరాబాద్‌లోని పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ వేపై ( PV Narasimha Rao Expressway) వెళ్తూ కారులో వెళ్తున్న యువ జంట.. మధ్యలో సన్‌రూఫ్ నుంచి బయటకు వచ్చి లిప్ కిస్‌తో రెచ్చిపోయారు. ఈ తతంగాన్నంతా వెనుక కారులో వస్తున్న వారు తమ ఫోన్లో చిత్రీకరించడంతో అదికాస్తా ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తమ చర్యతో సామాన్య ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించడమే కాకుండా.. ప్రయాణ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గానూ యువ జంటపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Hope @hydcitypolice will take action on this unsafe driving mode & Inconvenience caused to public.. #PVNRExpressway pic.twitter.com/K2QgqgpStp
— Dharani (@DharaniBRS) October 15, 2023
Also Read..
Lakme Fashion Week | లాక్మే ఫ్యాషన్ వీక్‌లో బీటౌన్ తారల సందడి.. పిక్స్ వైరల్
Shah Rukh Khan | స్టార్ నటి కొంగుపట్టుకుని థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చిన షారుఖ్ ఖాన్.. వీడియో
Mrunal Thakur | అందానికే అసూయపుట్టేలా.. మృణాళ్ ఠాకూర్ సోయగానికి ఫిదా