హైదరాబాద్: నగర శివార్లలోని రాజేంద్రనగర్లో అనుమానంతో భార్యను హత్యచేశాడో భర్త. రాజేంద్రనగర్లోని ఇమాద్నగర్కు చెందిన సమ్రిన్, పర్వేజ్లు భార్యాభర్తలు. 14 ఏండ్ల క్రితం వారిద్దరికి వివాహమయింది. భార్యపై అనుమానం పెంచుకున్న పర్వేజ్ తరచూ గొడవపడుతూ ఉండేవాడు. గొడవలతో గతంలో విడాకులు తీసుకున్నారు. అయితే ఏడాదిక్రితం సమ్రిన్కు నచ్చజెప్పి ఇంటికి తీసుకొచ్చాడు. అయితే గురువారం రాత్రి ఇద్దరిమధ్య గొడవ జరిగింది. దీంతో ఆవేశంతో సమ్రిన్ మెడకోసి హత్యచేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.