రూ.1.63 లక్షల పైకి బంగారం
గత కొన్ని రోజులుగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ కొండెక్కుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోవడంతో దేశీయంగా ధరలు మూడు శాతం వరకు అధికమయ్యాయి. కిలో వెండి ఏకంగా రూ.2.7 లక్షలకు చేరుకోగా, బంగారం రూ.1.6 లక్షలు పలికింది.
- రూ.2 వేల వరకు పెరిగిన తులం ధర
- రూ.25 వేలు అధికమైన కిలో వెండి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: గత కొన్ని రోజులుగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ కొండెక్కుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోవడంతో దేశీయంగా ధరలు మూడు శాతం వరకు అధికమయ్యాయి. కిలో వెండి ఏకంగా రూ.2.7 లక్షలకు చేరుకోగా, బంగారం రూ.1.6 లక్షలు పలికింది. ఫలితంగా న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.3,300 లేదా 2 శాతం ఎగబాకి రూ.1,62,800కి చేరుకున్నది.
అంతకుముందు ఇది రూ.1,59,500గా ఉన్నది. అలాగే కిలో వెండి రూ.8 వేలు లేదా 3.03 శాతం ఎగబాకి రూ.2.72 లక్షలకు చేరుకున్నది. ఇటు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ పదిగ్రాముల గోల్డ్ ధర రూ.2,070 ఎగబాకి రూ.1,61,350 పలికింది. అలాగే 22 క్యారెట్ ధర రూ.1,900 అందుకొని రూ.1,47,900కి చేరుకున్నది. వెండి రూ.10 వేలు అందుకొని రూ.3 లక్షలకు చేరుకున్నది.
ట్రంప్‌నకు వ్యతిరేకంగా అమెరికా సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతోపాటు అమెరికా-ఇరాన్‌ల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటుండటం ధరలు పుంజుకోవడానికి ప్రధాన కారణాలని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 3 శాతం లేదా 154 డాలర్లు ఎగబాకి 5,235 డాలర్లు పలుకగా, వెండి 6 శాతం లేదా 4.87 డాలర్లు అందుకొని 87 డాలర్లకు చేరుకున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

