Telangana Projects | ఎగువ కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని ప్రాజెక్టులుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కాళేశ్వరం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. మేడిగడ్డ బ్యారేజి 85 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 9,02,550 క్యూసెక్కులుగా ఉంది.
వరద ప్రవాహం పెరగడంతో నాగార్జున సాగర్ వద్ద 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 4.10 లక్షల క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 4.06 లక్షల క్యూసెక్కులగా ఉంది. నీటి సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 294.55 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 584.20 అడుగులుగా ఉంది.
జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో 42 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 2.6 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం 316.840 మీటర్లుగా ఉంది.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. 40 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 1.75 లక్షల క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 3.41 లక్షల క్యూసెక్కులుగా ఉంది. శ్రీరాం సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1087 అడుగుల వరకు నీరు చేరింది.
ములుగు జిల్లా రామన్నగూడెంలో గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. 15.45 మీటర్లకు గోదావరి నీటి మట్టం పెరిగింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ముంపు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.
మహబూబ్‌నగర్ కోయిల్ సాగర్ ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 4500 క్యూసెక్కులుగా ఉంది.
మానేరు నదికి వరద కొనసాగుతోంది. ఎగువ మానేరు డ్యాం వద్ద ఇన్‌ఫ్లో 9,734 క్యూసెక్కులగా ఉంది. మిడ్ మానేరుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఇన్‌ఫ్లో15,040, ఔట్‌ఫ్లో 3140 క్యూసెక్కులగా ఉంది. లోయర్ మానేరు డ్యామ్ వద్ద ఇన్‌ఫ్లో 1280, ఔట్‌ఫ్లో 219 క్యూసెక్కులుగా ఉంది.