నర్సంపేట, ఫిబ్రవరి 14 : సీసీఐ పత్తి కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందని, వెంటనే సీబీఐతో విచారణ చేపట్టాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. సుమారు రూ.వెయ్యికోట్ల మేర అవినీతి జరగడం దారుణమని అన్నారు. శుక్రవారం ఆయన వరంగల్ జిల్లా నర్సంపేటలో మీడియాతో మాట్లాడారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలువు దోపిడీ చేసిందని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్లలో ఈ కుంభకో ణం జరిగిందని, రైతులను కాంగ్రెస్ పార్టీ నిలువు దోపిడీ చేసిందని విమర్శించారు. సీఎం, వ్యవసాయశాఖ మంత్రి వెంటనే స్పందించి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంపై వెంటనే సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.