RTA | హైదరాబాద్ : ఖైరతాబాద్ రవాణా శాఖ నిర్వహించిన ఫ్యాన్సీ నెంబర్ల వేలంలో రూ.65.38 లక్షలు ఆదాయం సమకూరింది. ఈమేరకు హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సీ రమేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో ఆల్టైమ్ ఫ్యాన్సీ నెంబర్ 9999 ఏకంగా రూ.22,72,000 ధర పలికింది. మరో నెంబర్ 0009 రూ.68,000కు అమ్ముడుపోయింది. వీటితో పాటు మరికొన్ని ఫ్యాన్సీ నెంబర్లకు భారీ ధర వెచ్చించి వాహనదారులు కొనుగోలు చేసినట్లు రమేష్ వెల్లడించారు.