ఆదిలాబాద్ : ప్రభుత్వం పేదలకు అందించే (పీడీఎఫ్) రేషన్ బియ్యాన్ని(Ration rice) అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..నిర్మల్ నుంచి మహారాష్ట్రలోని గొండియా జిల్లాకు రేషన్ బియ్యం తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. బోరజ్ చెక్‌పోస్ట్ వద్ద సోదాలు నిర్వహించి డీసీఎంలో తరలిస్తున్న 280 క్వింటల్లా బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పట్టుబడిన బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు బదిలీ చేశారు. కాగా, ఎవరైనా రేషన్ బియ్యం అమ్మినా, కొన్నా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, జైనథ్ సీఐ డి సాయినాథ్, ఎస్ఐ పురుషోత్తం పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
RSP | ఆకాశానికి ఎగిసిన గురుకులాలను అధోపాతాళానికి తొక్కుతున్నారు.. రేవంత్ సర్కార్‌పై ఆర్ఎస్పీ ధ్వజం
KTR | కేసీఆర్ రైతును రాజు చేస్తే.. రేవంత్ రైతు ప్రాణాలను తీస్తున్నాడు : కేటీఆర్