సంగారెడ్డి : గంజాయి(Ganja) కట్టడికి పోలీసులు పాటుపడుతున్నారు. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతూ గంజాయి సరఫరాను అడ్డుకుంటున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ రూపేష్ చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్లో(Chiragpally police station) నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. గంజాయిని తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు జహీరాబాద్ మండలం చిరాగ్ పల్లి గ్రామం మాడ్గి ఆర్టీఏ చెక్ పోస్టు వద్ద తనిఖీలు చేపట్టారు.
ఈ సోదాల్లో బొలేరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 140 కిలోల నిషేధిత గంజాయిని స్వాధీనం చేసు కున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.35 లక్షలు ఉంటుందని ఎస్పీ రూపేష్ తెలిపారు. ఇద్దరు నింది తులు అరెస్టు, బొలెరో వాహనం సీజ్ చేశామని పేర్కొన్నారు. ఎవరైనా గంజాయి అమ్మినా, కొనుగోలు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.