హైదరాబాద్, నవంబర్ 13(నమస్తే తెలంగాణ) : ఇందిరమ్మ ఇండ్ల ప థకం నిరంతర ప్రక్రియ అని, త్వరలో నే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. బుధవారం గాంధీభవన్లో ని ర్వహించిన ముఖాముఖి, దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ఆయన మా ట్లాడుతూ… ఎకువ దరఖాస్తులు ఇందిరమ్మ ఇళ్ల గురించే వచ్చాయన్నారు. మొదటి విడతగా 4 నుంచి 5 లక్షలు ఇండ్లు మంజూరు చేస్తామని చె ప్పారు. ఏటా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. 400 చదరపు అడుగుల్లో ఇల్లు నిర్మించుకోవాల్సి ఉం టుందని, డిజైన్లపై ఎలాంటి షరతులు లేవని స్పష్టం చేశారు. కొత్త ఆర్వోఆర్ చట్టంతో భూ సమస్యలు పరిషరిస్తామని తెలిపారు. మిగిలిన రైతులకు 2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని, రైతుభరోసా ఇస్తామని వెల్లడించారు.