హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కేఆర్ సురేశ్‌రెడ్డిని నియమించనున్నట్టు అధ్యక్షుడు కేసీఆర్ తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో రాజ్యసభ చైర్మన్‌కు లేఖ రాయనున్నట్టు ఆయన వెల్లడించారు.
ఇప్పటి వరకు పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న కేశవరావు పార్టీ వీడడంతో ఆ స్థానంలో కేఆర్ సురేశ్ రెడ్డిని నియమించనున్నట్టు తెలంగాణ భవన్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో కేసీఆర్ స్పష్టం చేశారు. రాజ్యసభలో బీఆర్ఎస్కు ప్రస్తుతం సురేశ్‌రెడ్డి, దామోదర్‌రావు, పార్థసారథి, రవిచంద్ర సభ్యులుగా ఉన్నారు.