హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): బీజేపీ కక్షసాధింపు చర్యలను ప్రజల్లో ఎండగడుతామని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను సమ్మిళితం చేసి చైతన్యం చేసిన నాయకురాలిగానే కాకుండా ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్సీ కవిత ప్రజల హృదయాలను చూరగొన్నారని పేర్కొన్నారు. శనివారం ఆయన ఢిల్లీకి వెళ్తూ శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ అప్రజాస్వామిక రాజకీయాలను బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఎండగడుతున్నారని, చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కావాలని ఎమ్మెల్సీ కవిత పోరాడుతున్నారని చెప్పారు. వీటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కవితకు కేంద్రం ఈడీ నోటీసులు ఇచ్చిందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్సీ కవిత పోరాట యోధురాలని ఆయన అభివర్ణించారు. రాష్ట్ర మహిళలను అవ మానించేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాలని సూచించారు.
కవితను బలవంతంగా ఇరికించే కుట్ర
రాజకీయంగా ఎదుర్కోలేకే సీఎం కేసీఆర్ కుటుంబా న్ని బీజేపీ టార్గెట్ చేసింది. లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని దేశమంతా గగ్గోలు పెడుతున్న అదానీని వదిలేసి, ప్రజల కోసం పనిచేసే కవితను ఈడీ విచారించడం సిగ్గుచే టు. లిక్కర్ కేసులో కవితను దొడ్డిదారిన ఇరికించే ప్రయత్నం జరుగుతున్నది. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ సమాజం సహించదు.
–నవీన్ ఆచారి, భారత్ జాగృతి జనరల్ సెక్రటరీ
జేబు సంస్థలతో వేధింపులా?
అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలే రు అన్నట్టుగా.. ఈడీ, సీబీఐ విచారణల పే రుతో బీఆర్ఎస్ పా ర్టీని అడ్డుకోవడం ఎవరి తరమూ కాదు. ఆ ధైర్యం లేకే కేంద్ర ప్రభుత్వం.. ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను మా పార్టీ నేతలపై ఉసిగొల్పుతున్నది. బీజేపీ బెదిరింపులకు భయపడం.
– కోలేటి దామోదర్, రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్