40 లక్షల విలువైన మద్యం లూటీ
వైన్‌షాపుల యాజమాన్యాలు ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తున్నారని ఆగ్రహించి గ్రామస్థులు మద్యం బాటిళ్లను లూటీ చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలో జరిగింది. ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను తెలిపిన వివరాల ప్రకారం..
- వైన్ షాపుల్లో ఎమ్మార్పీ కంటే అధికంగా
- వసూలు చేస్తున్నందుకు ఆగ్రహం
- నాలుగు వైన్ షాపులపై గ్రామస్థుల దాడి
- భద్రాద్రి జిల్లా టేకులపల్లిలో ఘటన
టేకులపల్లి, మార్చి 20: వైన్‌షాపుల యాజమాన్యాలు ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తున్నారని ఆగ్రహించి గ్రామస్థులు మద్యం బాటిళ్లను లూటీ చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలో జరిగింది. ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను తెలిపిన వివరాల ప్రకారం.. టేకులపల్లి మండల కేంద్రంలో మొత్తం నాలుగు వైన్ షాపులు ఉన్నాయి. బుధవారం ఉదయం 10 గంటల తర్వాత దుకాణాలు తెరుచుకున్నాయి. కొందరు గ్రామస్థులు వైన్స్‌కు వెళ్లారు. నాలుగు దుకాణాల్లో సిబ్బంది ఒక్కో క్వార్టర్‌పై రూ.20 నుంచి రూ.30 వరకు అధికంగా వసూలు చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
యాజమాన్యాలు బ్రాండెడ్ మద్యాన్ని బెల్ట్ షాపులకు తరలిస్తున్నారని, దొరికే మద్యాన్నైనా ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారని మండిపడ్డారు. దీంతో వైన్‌షాపుల వద్ద పరిస్థితి ఉద్రిక్తత ఏర్పడింది. ఆందోళనకారుల ఆగ్రహావేశాలతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఇదే అదునుగా భావించిన గ్రామస్థులు నాలుగు షాపుల్లో సుమారు రూ.40 లక్షల విలువైన మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు. కొందరు ఒకటి రెండు సీసాలను తీసుకెళ్లగా మరికొందరు కాటన్ల కొద్దీ తమ ఇండ్లకు తరలించారు. సమాచారం అందుకున్న టేకులపల్లి సీఐ తాటిపాముల సురేశ్, ఇల్లెందు సీఐ కరుణాకర్ పోలీస్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వచ్చారు. వైన్ షాపుల యాజమాన్యాల ఫిర్యాదుల మేరకు విచారణ ప్రారంభించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

