Highcourt | హైదరాబాద్ : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన కేసులో హైకోర్టులో మంగళవారం విచారణ ముగిసింది. అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్‌పై వాదనలు విన్న సీజే ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. బీఆర్ఎస్ తరపున సీనియర్ న్యాయవాది మోహన్ రావు వాదనలు వినిపించారు. సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్ చేసే అర్హత అసెంబ్లీ కార్యదర్శికి లేదన్నారు. అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్‌కు విచారణ అర్హత లేదన్నారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ సకాలంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఇరు వైపులా వాదనలు విని.. విచారణ ముగిస్తున్నట్టు ప్రకటించిన సీజే ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది.
ఇవి కూడా చదవండి..
Cold Wave | తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత.. క్రమంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు
ICC Award | మ్యాచ్ విన్నర్లకు సలాం.. ఐసీసీ అవార్డు మళ్లీ వాళ్లకే
Honda Amaze | హోండా నుంచి థర్డ్ జనరేషన్ అమేజ్ ఆవిష్కరణ.. ఇవీ డిటెయిల్స్..!