Cold Wave | తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత.. క్రమంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు
Cold Wave | తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. గత పది రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల దిగువకు పడిపోయాయి.
Cold Wave | హైదరాబాద్ : తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. గత పది రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల దిగువకు పడిపోయాయి. ఉత్తర, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం ఎకువగా ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. చలికి తోడుగా భారీ పొగ మంచు ఉండటంతో రోడ్లపై వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో రానున్న రోజుల్లో చలి పులి పంజా విసురుతుందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
సోమవారం పలు జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మెదక్‌లో అత్యల్పంగా 14.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో 15.7 డిగ్రీల సెల్సియస్, పటాన్చెరులో 16.2, దుండిగల్‌లో 18, నిజామాబాద్‌లో 18.7, రామగుండం, హనుమకొండ, హకీంపేటల్లో 19, హైదరాబాద్‌లో 19.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదనట్లు తెలిపారు. అదే సమయంలో పగటి ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణ స్థాయిలోనే నమోదవుతున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. కొన్నిచోట్ల మాత్రం 32 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
GATE | గేట్ పరీక్షల షెడ్యూల్ విడుదల..
Osmania University | ఎంబీఏ వన్‌టైం చాన్స్ పరీక్షా తేదీల ఖరారు
IPL 2025 | కోచ్‌గా వరల్డ్ కప్ హీరో.. బలం పెంచుకున్న ఢిల్లీ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

