IPL 2025 : ఐపీఎల్ మెగా వేలం ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (Ricky Ponting) స్థానంలో భారత మాజీ ఆటగాడు హేమంద్ బదొనికి హెడ్‌కోచ్ బాధ్యతలు అప్పగించిన ఢిల్లీ యాజమాన్యం తమ కోచింగ్ స్టాఫ్‌ను మరింత పటిష్ఠం చేసుకుంది. భారత జట్టు వన్డే వరల్డ్ కప్ హీరో అయిన మునాఫ్ పటేల్ (Munaf Patel)ను ఢిల్లీ కొత్త బౌలింగ్ కోచ్‌గా నియమించింది.
ఆస్ట్రేలియకు చెందిన జేమ్స్ హోప్స్ స్థానంలో మునాఫ్ ఢిల్లీ బౌలింగ్ యూనిట్‌కు దిశానిర్దేశనం చేయనున్నడని మంగళవారం ఢిల్లీ ఫ్రాంచైజీ వెల్లడించింది. దాంతో, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ వేణుగోపాల రావు, హెడ్‌కోచ్ హేమంగ్ బదొనిలతో కలిసి మునాఫ్ 18వ సీజన్లో ఢిల్లీ జట్టు గెలుపు వ్యూహాలు రచించనున్నాడు.
Old-school grit 🤝 Winning mindset
Welcome to DC, legend 🥹💙 pic.twitter.com/d62DSCcqNR
— Delhi Capitals (@DelhiCapitals) November 12, 2024
భారతీయ పిచ్‌లు, ఇక్కడి పరిస్థితులపై లోతైన అవగాహన ఉన్న మునాఫ్ ఢిల్లీ బౌలింగ్ యూనిట్‌కు నిజంగానే బలం కానున్నాడు. గతంలో రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్లకు ఆడిన మునాఫ్.. 63 మ్యాచుల్లో 75 వికెట్లు పడగొట్టాడు.
టీమిండియా 2011లో వరల్డ్ కప్ గెలవడంలో మునాఫ్ పటేల్ పాత్ర ఉంది. పవర్ ప్లేలో కీలక వికెట్లు తీసిన అతడు ఎంఎస్ ధోనీ సారథ్యంలోని భారత జట్టు రెండోసారి వన్డే వరల్డ్ కప్ చాంపియన్ కావడంలో భాగమయ్యాడు. అయితే.. దేశం తరఫున మునాఫ్ ఆడింది కొన్నాళ్లే. 2006 నుంచి 2011 మధ్య దేశానికి ప్రతినిధ్యం వహించిన మునాఫ్ 13 టెస్టులు, 70 వన్డేలు, 3 టీ20 లు ఆడాడంతే.
పద్నాలుగో సీజన్ రన్నరప్ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ స్క్వాడ్‌లో భారీ మార్పులు చేయనుంది. కెప్టెన్ రిషభ్ పంత్‌ను వదిలేసిన ఢిల్లీ 18వ సీజన్ కోసం ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, వికెట్ కీపర్ అభిషేక్ పొరెల్‌లను మాత్రమే రీటైన్ చేసుకుంది.
❤️💙 ➡️ 😄 pic.twitter.com/04uaunVDqF
— Delhi Capitals (@DelhiCapitals) November 12, 2024
ఈసారి ఢిల్లీ రూ.73 కోట్లతో మెగా వేలంలో పాల్గొననుంది. నవంబర్ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా వేలం జరుగనుంది. దాంతో, మ్యాచ్ విన్నర్లను కొనడంపై దృష్టి పెట్టిన ఢిల్లీ.. యువకెరటాల జాబితాను సిద్దం చేసుకుంటోంది.