ICC Award : అంతర్జాతీయ క్రికెట్లో మ్యాచ్ విన్నర్లకే ఐసీసీ అవార్డులు దక్కడం చూస్తున్నాం. తాజాగా అక్టోబర్ నెలలోనూ అదే జరిగింది. అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించిన ఇద్దరికి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు సొంతమైంది. మంగళవారం ఐసీసీ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ (Player Of The Month) అవార్డు విజేతలను ప్రకటించింది. పురుషుల విభాగంలో పాకిస్థాన్ స్పిన్నర్ నొమన్ అలీ (Noman Ali), మహిళల కేటగిరీలో అమేలియా కేర్ (Amelia Kerr) అవార్డుకు ఎంపికయ్యారు.
పాకిస్థాన్ స్పిన్నర్ నొమన్ అలీకి ఓటింగ్లో ఎక్కువ ఓట్లు వచ్చాయి. దాంతో, అతడు తొలిసారి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికా పేస్ పేసర్ కగిసో రబడ, న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్లను వెనక్కి నెట్టి మరీ నొమన్ ఈ అవార్డు కొల్లగొట్టడం విశేషం.
One of the chief architects of Pakistan’s stunning Test series comeback against England, Noman Ali is the ICC Men’s Player of the Month for October 🏅
➡ https://t.co/uSrr2SqslE pic.twitter.com/ER2uoD43aU
— ICC (@ICC) November 12, 2024
స్వదేశంలో ఇంగ్లండ్ బ్యాటర్లను వణికించిన అలీ వికెట్ల వేటతో పాకిస్థాన్ చారిత్రాత్మక విజయంలో భాగమయ్యాడు. రెండు టెస్టుల్లో అలీ 11/147, 9/130తో అదరహో అనిపించాడు. మొత్తంగా రెండు టెస్టుల్లో 20 వికెట్లు పడగొట్టాడు.
#T20WorldCup Champion 🏆
Player of the Final and Player of the Tournament 🏏
and now ICC Women’s Player of the Month 🏅It was a dream October for Melie Kerr 🤩
➡ https://t.co/FwYY4k9kET pic.twitter.com/vFicrT6IB1
— ICC (@ICC) November 12, 2024
ఇక మహిళల విభాగంలో టీ20 వరల్డ్ కప్లో మెరిసిన న్యూజిలాండ్ ఆల్రౌండర్ అమేలియా కేర్ విజేతగా నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో అమేలియా బ్యాటుతో, బంతితో రాణించింది. కీలక సమయాల్లో వికెట్లు తీసిన అమేలియా న్యూజిలాండ్ తొలి టీ20 వరల్డ్ కప్ కలను సాకారం చేసింది. ప్లేయర్ ఆఫ్ ది అవార్డు కోసం లారా వొల్వార్డ్త్(దక్షిణాఫ్రికా కెప్టెన్), డియాండ్ర డాటిన్(వెస్టిండీస్)లు అమేలియాతో పోటీ పడినా ముందంజ వేయలేకపోయారు.