Honda Amaze | ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా (Honda Cars India) భారత్ మార్కెట్లోకి తన థర్డ్ జనరేషన్ హోండా అమెజ్ (Honda Amaze) కారు ఆవిష్కరించేందుకు ముహూర్తం ఖరారు చేసింది. థాయిలాండ్ లోని హోండా ఆర్ అండ్ డీ ఆసియా పసిఫిక్ సెంటర్లో కంపాక్ట్ సెడాన్ అమేజ్ కారును డిజైన్ చేశారు. హోండా కార్స్ భారత్ మార్కెట్లో కంపాక్ట్ సెడాన్ అమేజ్ (Honda Amaze), మిడ్ సైజ్ సెడాన్ సిటీ (Honda City), మిడ్ సైజ్ ఎస్యూవీ ఎలివేట్ (Honda Elevate) విక్రయిస్తోంది. మారుతి సుజుకి న్యూ డిజైర్, హ్యుండాయ్ ఔరా, టాటా టైగోర్ మోడల్ కార్లతో హోండా థర్డ్ జనరేషన్ హోండా అమేజ్ (Honda Amaze) కారు పోటీ పడుతుంది. డిసెంబర్ నాలుగో తేదీన హోండా థర్డ్ జనరేషన్ అమేజ్ కారు ఆవిష్కరిస్తారు.
థర్డ్ జనరేషన్ హోండా అమేజ్ (Honda Amaze) ఎల్ఈడీ హెడ్ లైట్లతోపాటు రీ డిజైన్డ్ గ్రిల్లె, జడ్-షేప్డ్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్, న్యూ అల్లాయ్ వీల్స్, రీ డిజైన్డ్ డాష్ బోర్డ్, స్లీక్ ఎయిర్ కన్ వెంట్స్, న్యూ ఫ్రీ స్టాండింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్ లెస్ చార్జర్, క్రూయిజ్ కంట్రోల్ తోపాటు సేఫ్టీ కోసం సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. హోండా అమేజ్ కారు 1.2 లీటర్ల 4 సిలిండర్ ఎస్ఓహెచ్ సీ ఐ-వీటెక్ పెట్రోల్ ఇంజిన్ (90 పీఎస్ విద్యుత్, 110 ఎన్ఎం టార్క్)తో నడుస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లతో నడుస్తుంది.
పాత మోడల్ హోండా అమేజ్ కారు ధర రూ.7.19 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి రూ.9.95 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకూ పలుకుతుంది. న్యూ హోండా అమేజ్ ధర రూ.7.25 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి రూ.10.10 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకూ పలుకుతుందని భావిస్తున్నారు. హోండా తన ఫస్ట్ జనరేషన్ అమేజ్ కారును 2013లో, సెకండ్ జనరేషన్ అమేజ్ 2018లో మార్కెట్లోకి తీసుకొచ్చింది.