BRS | రాజకీయ కక్షతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను వేధిస్తున్న కాంగ్రెస్ సర్కార్ దుర్మార్గపు వైఖరిపై హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ వద్ద గులాబీ దళం భగ్గుమన్నది. బంజారాహిల్స్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో సిట్ విచారణ నేపథ్యంలో తెలంగాణ భవన్‌కు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చి నిరసనలు చేపట్టారు. సీఎం డౌన్‌డౌన్ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతన్న సురేశ్ యాదవ్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు బీఆర్ఎస్ కార్యకర్తలు ఉరివేశారు. అనంతరం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది.
అనంతరం నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి బీఆర్ఎస్ కార్యకర్తలు బయల్దేరారు. అనుమతి లేదంటూ వారిని పోలీసులు అడ్డుకునేందుకు యత్నించడంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఓ మహిళ కిందపడింది. మరోవైపు నందినగర్‌లోని కేసీఆర్ నివాసం దగ్గర కూడా ఉద్రిక్తత నెలకొంది. కేసీఆర్ నివాసానికి వెళ్లేందుకు బీఆర్ఎస్వీ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు.
రాజకీయ కక్షతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని వేధిస్తున్న కాంగ్రెస్ సర్కార్ దుర్మార్గపు వైఖరిపై..
తెలంగాణ భవన్ వద్ద భగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులు🔥🔥♦️రైతన్న సురేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఓటుకు నోటు దొంగ రేవంత్ దిష్టి బొమ్మను ఉరి తీసిన బీఆర్ఎస్ కార్యకర్తలు
♦️అనంతరం రేవంత్ దిష్టి… pic.twitter.com/BXC46efgPo
— BRS Party (@BRSparty) February 1, 2026