హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ) : ఎస్ఎల్బీసీ సొంరంగంలో జరిగిన ప్రమాదంపై విచారణ అవసరం లేదని హైకోర్టు పేర్కొంది. ఆ ప్రమాదం జరిగి 10 రోజులవుతున్నా కార్మికుల ఆచూకీ లేదని, సొరంగ నిర్మాణాన్ని నిలిపివేసేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని పేర్కొంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ రేణుక ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టిన సహాయ చర్యల గురించి వివరించారు. 44 కి.మీ. పొడవైన సొరంగం పనుల్లో చాలా వరకు పూర్తయ్యాయని చెప్పారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వం చెప్పిన సహాయక చర్యల్లో లోటుపాట్లు ఉంటే పిటిషనర్ తిరిగి హైకోర్టుకు రావచ్చునని స్పష్టం చేస్తూ.. పిల్‌పై విచారణ ముగించింది.
హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ) : ఖమ్మం జిల్లాలో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్టు అందిన లేఖను హైకోర్టు సుమోటో ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి, సోమవారం విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్ర ధాన కార్యదర్శితోపాటు గనులు, భూగర్భ శాఖకు, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మం డలి సభ్య కార్యదర్శికి, అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్లకు నోటీసులు జారీచే సింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేస్తున్నట్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ రేణుక ధర్మాసనం ప్రకటించింది.