హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): మహేశ్వరం మండలం నాగారంలోని భూదాన్ భూముల్లో అక్రమాలకు సంబంధించిన వ్యవహారంపై ఈడీ దర్యా ప్తు కొనసాగించవచ్చునని హైకోర్టు స్పష్టంచేసింది.
నాగారంలోని సర్వే నం.181, 182, 194లోని భూదాన్ భూముల అక్రమాలపై పోలీసులు నమోదుచేసిన కేసు ఆ ధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ నిందితులు ఎంఏ అక్బర్, లతీఫ్ రెహమాన్, షర్ఫాన్ అబ్దుల్ రెహమాన్, షర్ఫాన్ వేసిన పిటిషన్ను కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్ పీ శ్యాంకోశీ, జస్టిస్ సుద్దాల చలపతిరావు ధర్మాసనం గురువారం తీర్పు చెప్పింది. ఈడీ వాదనను ఆమోదించింది.