హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం దోనబండ గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయానికి చెందిన 15.14 ఎకరాల భూముల సాగుకు దేవాదాయశాఖ జారీచేసిన లీజు నోటిఫికేషన్ అమలును నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. వేలాన్ని నిలిపివేయాలంటూ ఆలయ అనువంశిక అర్చకుడు దాఖలు చేసిన పిటిషన్పై తాతాలిక ఉపశమనం ఇవ్వడానికి జస్టిస్ జీఎం మొహియుద్దీన్ నిరాకరించారు. భూమిని సాగు చేసేందుకు జారీచేసిన వేలం నోటిఫికేషన్ను నిలిపివేయాల్సిన అవసరం కనిపించడం లేదని స్పష్టంచేశారు. ఆలయ భూమి వేలాన్ని నిలిపివేయాలంటూ పోలాస శ్రీశైలం అనే అనువంశిక ఆలయ అర్చకుడు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు పరిశీలించిన హైకోర్టు కౌలు హకుల కోసం నిర్వహించే వేలాన్ని నిలిపివేయడానికి కారణాలు లేవని స్పష్టంచేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను జూన్ 12కు వాయిదా వేసింది.