హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్ వద్ద ఇటీవల ఓ కేసు విచారణలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి నుంచి స్వాధీనం చేసుకున్న ఐఫోన్‌ను తిరిగి ఇవ్వాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. నిందితుల నుంచి ఫోన్లను స్వాధీనం చేసుకునేటప్పుడు చట్టపరమైన నిబంధనలను అమలు చేయాలని స్పష్టంచేసింది.
కౌశిక్‌రెడ్డి నుంచి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నప్పుడు పోలీసులు నిబంధనలను అనుసరించలేదని తప్పుపట్టింది. పోలీసుల చర్యలు బీఎన్ఎస్ఎస్లోని 105, 106 సెక్షన్లకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆక్షేపించింది. కౌశిక్‌రెడ్డి ఐఫోన్‌ను తక్షణమే తిరిగి ఇచ్చేయాలని పోలీసులకు స్పష్టం చేసింది.