హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): కూకట్పల్లి నియోజకవర్గం లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలోనే సంక్షేమ పథకాల చె కులను లబ్ధిదారులకు పంపిణీ చేయాల ని హైకోర్టు ఆదేశించింది. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే సమక్షంలోనే లబ్ధిదారుల కు చెకులను పంపిణీ చేయాలని బుధవా రం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కూకట్పల్లిలో బీసీ, మైనారిటీ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన బండి రమేశ్ ఆధ్వర్యంలో అధికారులు చె కులను పంపిణీ చేస్తున్నారంటూ ఎమ్మె ల్యే మాధవరం కృష్ణారావు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ టీ మాధవీదేవి బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ 2015లో వెలువడిన జీవోలు 18, 25 ప్రకారం సంక్షేమ పథకాల చెకు ల పంపిణీలో స్థానిక ఎమ్మెల్యే భాగస్వా మ్యం ఉండాలని, అయితే అధికారులు ఈ జీవోలకు విరుద్ధంగా ప్రతిపక్షానికి చెందిన శాసనసభ్యులను పకనబెడుతున్నారని తెలిపారు. దీనిపై వివరాలు తెలుసుకునేందుకు గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. కాగా, విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. ఈలోగా ప్రభుత్వ అధికారులు తమ వాదనలతో కౌంటర్లు దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది.