హైదరాబాద్, ఏప్రిల్ 4(నమస్తే తెలంగాణ): నీటి పారుదల శాఖలో రిటైర్ అయిన తాత్కాలిక ఉ ద్యోగుల సేవలను క్రమబద్ధీకరించి, వారికి పెన్షన్ ప్ర యోజనాలు కల్పించాలని 2023లో న్యాయస్థానం వెలువరించిన ఉత్తర్వులను అమలు చేయనందుకు ముగ్గురు ఐఏఎస్ అధికారులతోపాటు ఇరిగేషన్ శా ఖకు చెందిన ఇద్దరు అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆ ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదో స్వయంగా కోర్టుకు హాజరై వివరించాలని ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ మాజీ ముఖ్య కార్యదరి కే రామకృష్ణారావుతోపాటు నీటిపారుదల శాఖ మాజీ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన రాహుల్ బొజ్జా, ఖమ్మం కలెక్టర్‌గా పనిచేసిన ముజామ్మిల్ ఖాన్, ఈఎన్సీ జీ అనిల్‌కుమార్, ఎస్ఈ ఆర్ సుధీ ర్, ఈఈ హెచ్వీ రాంప్రసాద్‌కు జస్టిస్ పీ శ్యాంకోశీ, జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ధర్మాసనం ఇటీవల కోర్టు ధిక్కార నోటీసులు జారీచేసింది.