హైదరాబాద్ ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ ) : రంగారెడ్డి జిల్లా ఈర్లపల్లిలో భూ వివాదంపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, కుటుంబసభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని జస్టిస్ కే లక్ష్మణ్ సోమవారం పోలీసులను ఆదేశించారు. తదుపరి విచారణను మార్చి 3కు వాయిదా వేశారు. జీవన్‌రెడ్డితోపాటు ఆయన కుటుంబసభ్యులు తన భూమిని కబ్జా చేశారని, ఇదేమిటని ప్రశ్నిస్తే మారణాయుధాలతో బెదిరించారని దామోదర్‌రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో నిరుడు చేవెళ్ల పీఎస్‌లో కేసు నమోదైంది. దీన్ని కొట్టేయాలని జీవన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ఇటీవల హైకోర్టు డిస్మిస్ చేసింది. ముందస్తు బెయిల్ కోసం జీవన్‌రెడి హైకోర్టును ఆశ్రయించారు.
బండ్లగూడ, ఫిబ్రవరి 24: రాజేంద్రనగర్ మున్సిపల్ ఆఫీస్‌లో ఇద్దరు ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు. మైలార్‌దేవ్‌పల్లికి చెందిన బిల్ కలెక్టర్ మధు, అతని అసిస్టెంట్ రమేశ్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మైలార్‌దేవ్‌పల్లికి చెందిన ఓ వ్యక్తి ఇంటి అసెస్మెంట్కు దరఖాస్తు చేయగా బిల్ కలెక్టర్ లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశాడని ఏసీబీకి ఫిర్యాదు చేయగా లం చం తీసుకుంటుండగా పట్టుకున్నారు.