హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా గోపన్‌పల్లిలోని 36/ఏ ఏ, 36/ఈ సర్వే నంబర్లలో 17.04 ఎకరాల వివాదాస్పద భూముల క్రయవిక్రయాలపై హైకోర్టు స్టే విధించింది. జస్టిస్ కే లక్ష్మణ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
నిషేధిత జాబితాలో ఉన్న ఈ భూములను థర్డ్ పార్టీకి అప్పగించేందుకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జూన్ 23న ప్రొసీడింగ్స్ జారీ చేశారు. దీంతో బీటీఎన్జీవోలు, గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ హైకోర్టును ఆశ్రయించింది. విచారణను వచ్చే నెల 2కు వాయిదా వేసింది.