హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 14(నమస్తే తెలంగాణ): చెరువుల పరిరక్షణ విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. హెచ్ఎండీఏ పరిధిలోని 3వేలకుపైగా ఉన్న చెరువులకు హద్దురాళ్లను నిర్ధారించాల్సిందేనని స్పష్టంచేసింది. హెచ్ఎండీఏ పరిధిలోని చెరువులను పరిరక్షించాలంటూ దాఖలైన పిల్‌ను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు.. గురువారం ఆదేశాలు జారీ చేసింది. నిరుడు గచ్చిబౌలిలోని రామమ్మకుంట చెరువు భూముల్లో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలంటూ కొందరు పర్యావరణ, జల వనరు ల పరిరక్షణ కమిటీ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే మరోవైపు రామమ్మకుంట చెరువు భూముల్లో ఉన్న ప్రభుత్వ భవనాలను హైడ్రా కూల్చివేసింది.
ఈ కూల్చివేతలపై అఫిడవిట్ దాఖలు చేయాలని, అ లాగే నగరవ్యాప్తంగా ఉన్న 3వేలకుపైగా చెరువులకు కూడా హద్దులను నిర్ధారణ చేయాలని హెచ్ఎండీఏను ఆదేశించింది. ఇప్పటివరకు పూర్తయిన చెరువుల హద్దుల నిర్ధారణకు సంబంధించిన నివేదికను కూడా పొందుపరుచాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే హెచ్ఎండీఏ ఆ ప్రక్రియను పూర్తి చేయలేకపోయింది. వచ్చే ఏడాది జనవరి 30లోగా అన్ని చెరువులకు బఫర్, ఎఫ్టీఎల్ జోన్ నిర్ధారణతోపాటు ఫైనల్ నోటిఫికేషన్ ఇస్తూ నివేదిక అందజేస్తామని హెచ్ఎండీఏ హైకోర్టుకు తెలిపింది. దీనిపై స్పందించిన హైకోర్టు గడువులోగా నోటిఫికేషన్ పూర్తి చేయాలని పేర్కొన్నది.
గచ్చిబౌలిలోని రామమ్మకుంట బఫర్‌జోన్‌లో నిర్మించిన నిథమ్ సంస్థకు చెందిన నిర్మాణాలపై హైకోర్టులో విచారణ జరుగుతుండగా.. అక్కడ హైడ్రా కూల్చివేతలు నిర్వహించింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఒక్క చెరువునే కాకుం డా నగరంలో ఉన్న మిగిలిన 3,523 చెరువులకు హద్దులను నిర్ధారించే నోటిఫికేషన్ ను జారీచేయాలన్న అంశాన్ని సుమోటో గా స్వీకరించింది. హైకోర్టు నిర్ణయంపై ప ర్యావరణ, సామాజిక కార్యకర్తలు రాజ్‌కుమార్ ఠాకూర్‌సింగ్ హర్షం వ్యక్తంచేశారు. జనవరి 30లోగా హెచ్ఎండీఏ పరిధిలోని అన్ని చెరువులను నోటిఫై చేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.