హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠను దెబ్బతీసేలా విమర్శలు చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై రాష్ట్రంలోని వేర్వేరు పోలీస్ స్టేషన్లల్లో 6 కేసులు ఎలా నమోదు చేస్తారని పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది. ఆ 6 ఎఫ్ఐఆర్ల అమలును నిలిపివేస్తూ ఆదేశాలిచ్చింది. కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ కే లక్ష్మణ్ సోమవారం విచారణ చేపట్టారు. కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది.
హైదరాబాద్, ఆగస్టు 4(నమస్తే తెలంగాణ): చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం ఢిల్లీలో ఓబీసీ కులాల సమాఖ్య ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లా బీసీలకు సామాజిక రక్షణ, భద్రతకు బీసీ యాక్ట్‌ను తీసుకురావాలన్నారు.