హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లిలో 64 ఏండ్ల నుంచి నిర్వహిస్తున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. దాదాపు 365 మంది విద్యార్థుల్లో సుమారు 250 మంది బాలికలు ఉన్న పాఠశాలకు మరుగుదొడ్ల నిర్మాణం వద్దనడమేమిటని పిటిషనర్‌ను ప్రశ్నించింది.
తమ నివాసాల మధ్య మరుగుదొడ్ల నిర్మాణాన్ని అడ్డుకోవాలంటూ బీ నూతన్కుమార్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ కే లక్ష్మణ్ కొట్టివేశారు.