హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వీధికుక్కలు స్వై రవిహారం చేస్తున్నాయి. జనాన్ని వెంబడించి కాటు వేయడంతోపాటు ఏకంగా ఇండ్లలోకి చొరబడి దాడి చేస్తున్నాయి. దీంతో ఇటీవల 14 మంది గాయపడటంతోపాటు ఓ వృద్ధురాలు (82) మరణించింది. ఈ ఘటనలపై హైకోర్టు తీవ్రస్థాయిలో స్పందించింది.
వీధికుకలను నియంత్రించేందుకు జంతు సంక్షేమ సంస్థల ప్రతినిధులు, పశువైద్యులతో చర్చించి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వానికి, జీహెచ్ఎంసీ అధికారులకు స్పష్టం చేసిం ది. సమావేశాలు, సూచనలతో సరిపెట్టడానికి వీల్లేదని, సమగ్ర కార్యాచరణను అమలు చేయాలని తేల్చిచెప్పింది.
వీధికుక్కలను పట్టుకునేందుకు 24 గంట లూ అందుబాటులో ఉండేలా వాహనాల ఏర్పాటు తోపాటు కుకకాటు బాధితుల కోసం హెల్ప్‌లైన్‌ను, ఫిర్యాదుల స్వీకరణకు ఓ యాప్‌ను అందుబాటులోకి తేవాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం ఆదేశించింది. వీధికుక్కలకు ఆహారం లేక జనంపై దాడి చేస్తున్నాయంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంతోపాటు వాటి దాడుల వల్ల ఇటీవల బాగ్ అంబర్‌పేటలో ఓ విద్యా ర్థి, పటాన్చెరులో ఓ కార్మికుడి కుమారుడు మృతి ఘటనలపై విచారణను సెప్టెంబర్ 2కి వాయిదా వేశారు.