హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ) : రెవెన్యూ అధికారులు జారీచేసే నోటీసులను ఏ చట్టం కింద ఇస్తున్నారో చెప్పాలని హైకోర్టు స్పష్టం చేసింది. చట్టం గురించి ప్రస్తావించినపుడే నోటీసు ఇచ్చే అధికారం ఆ అధికారికి ఉన్నదో లేదో తేలుతుందని పేర్కొన్నది.
మేడ్చల్ మలాజిగిరి జిల్లా అల్వాల్ మండలం తోళ్ల కార్ఖానా (పాత సర్వే నంబర్ 380)లోని 5.30 ఎకరాలకు సంబంధించిన వివాదంపై 2019 జూన్‌లో తహసీల్దార్ జారీచేసిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ బుజ్జి బానోత్ మరో 39 మంది హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి ఇటీవల ఈ తీర్పు వెలువరించారు.