హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు సాధారణ తిరోగమన సమయం కంటే మూడ్రోజుల ముందుగానే ఉపసంహరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ప్రభావంతో ఈనెల 18వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.
బంగాళాఖాతం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని అంచనా వేసింది. ఆదివారం భద్రాద్రి-కొత్తగూడెం, పెద్దపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్టు వెల్లడించింది. సోమవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.