హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.
నైరుతి రుతుపవనాల తిరోగమన ప్రక్రియ ప్రారంభమైందని, వీటి ప్రభావంతో ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో 24న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఈ రుతుపవనాల తిరోగమనంలోనూ భారీ వర్షాలకు అవకాశం ఉన్నదని అధికారులు చెప్తున్నారు.