ములుగు : ములుగు జిల్లాలో వర్షం(Heavy rains) దంచికొడుతున్నది. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కరెంట్ స్తంభాలు నేలకొరిగి చెట్లు కూలిపోయాయి. పంట పొలాల్లోకి వరద వచ్చి చేరడంతో పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా మంగపేట, ఏటూరు నాగారం మండల కేంద్రాలలో భారీ వర్షం కురిసింది.19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
దీంతో మంగపేట మండలం గంపోనిగూడెం పెట్రోల్ పంపు, గ్రోమోర్ దుకాణం వెనుక పంట పొలాలు మునిగిపోయాయి. పలు కాలనీల్లో నీళ్లు ఇళ్లలోకి చేరాయి. కమలాపురంలో లోతట్టు ప్రాంతాలు నడుములతో నీటిలో నివాసాలు నీట మునిగాయి. కాగా, మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందును అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.